in ,

కల్లూరు బస్టాండ్ లో ఆర్టీసీ కార్గో ప్రైవేట్ ఏజెన్సీ ప్రారంభం

కల్లూరు బస్టాండ్ లో ఆర్టీసీ కార్గో ప్రైవేట్ ఏజెన్సీ సేవలను మంగళవారం మండల రైతుబంధు సమితి సభ్యులు లక్కినేని రఘు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం రీజియన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి గారి ఆదేశానుసారం  ఇప్పటివరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచిన కార్గో సేవలను నేటి నుండి ప్రైవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో కస్టమర్లకు సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. కల్లూరు కార్గో పాయింట్ సమయములు ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు కార్గో సేవలు ఉంటాయని కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా వివరించారు. కల్లూరులో ప్రైవేట్ ఏజెన్సీ కౌంటర్ ప్రారంభించడం తో మండల ప్రజలకు కార్గో సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని లక్కినేని రఘు ఈ సందర్భంగా అన్నారు. మరిన్ని వివరాలకు 7283906209 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ కే మునీర్ పాషా, మధిర మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బివి రావు, ఆర్టీసీ సిబ్బంది ఆనందరావు, అనిల్, మారేశ్వర రావు లతోపాటు బొప్పన రామారావు, మద్దినేని శ్రీనివాసరావు, ఏజెంట్ పెడకంటి రామకృష్ణ, వార్డు సభ్యులు ధార నరసింహారావు, పంచాయతీ సెక్రెటరీ కృష్ణారావు, ఖమ్మం పార్టీ రమేష్, బొల్లం నాగరాజు, యనుమల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబు చన్నీటి స్నానం చేస్తున్నారు- నారా భువనేశ్వరి

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా తన వంతు కృషి చేస్తానని”