రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు చెక్కులను శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ టి సి ఎండి సజ్జనార్ అందజేశారు.
లక్కీడ్రా విజేతలకు ఆర్టీసీ నగదు పురస్కారాలను అందజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల కోసం లక్కీ డ్రాను ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి నగదు పారితోషకంతో పాటు సత్కరించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రాను నిర్వహించి, ప్రతి రీజియన్‌కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను అధికారులు ఎంపిక చేశారు.
ఖమ్మం రీజియన్ పరిధిలో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి బహుమతి దేవల్ల రుక్మిణి (సత్తుపల్లి- రూ.25,000), రెండో బహుమతి జి భారతి (కల్లూరు- రూ.15,000), మూడవ బహుమతి పట్రా లక్ష్మి (పెనుబల్లి-10,000) నిలిచి నగదు బహుమతులు గెలుచుకున్నరు.
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు ౩౦, 31 తేదిల్లో సంస్థ లక్కీ డ్రా నిర్వహించగా.. మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్‌ను సేకరించారు.
ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ముగ్గురికి హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఎండీ సజ్జనార్ నగదు పారితోషకాన్ని అందజేశారు. అయితే, కార్యక్రమానికి రీజియన్ల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా లక్కీడ్రా విజేతలు ఆర్టీసీతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ దైనందిత జీవితంలో ఆర్టీసీ బస్సు ఓ భాగమైందని, ప్రతి రోజు లక్షలాది మందిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
[zombify_post]