అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకులోయ నియోజకవర్గం పరిధి అనంతగిరి మండలంలోని ఎగువశోభ పంచాయతీ జామిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 12 గిరిజన కుటుంబాలు రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఈ విషయౌప్ గత కొంతకాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రేషన్ కార్డులు లేకపోవడంతో కనీసం కుల ధృవీకరణ పత్రాలను కూడా పొందలేని పరిస్థితి నెలకొందని, దీంతో పిల్లలను పాఠశాలకు కూడా పంపలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు కూడా తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
[zombify_post]