- జగిత్యాల జిల్లా లో
ప్రజల సమస్య ల ను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలిపారు.
సోమవారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర , రెవిన్యూ అదనపు కలెక్టర్ బిఎస్ లత, సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజావాణికి విచ్చేసిన ప్రజల నుండి 25 దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎంతో దూరం నుంచి కష్ట పడి తమ సమస్య లపైన వినతులను ఇవ్వడాని కీ ప్రతీ సోమవారం కలెక్టరెట్ కీ ప్రజలు వస్తుంటారని… ఆయా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టందుకు ఎల్లప్పుడూ వివిధ శాఖల అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ అన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తో పాటు గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులను పరిశీలించే విషయం లో అన్నీ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారన్నారు.ఎంతో నమ్మకం తో తమ సమస్య ల పరిష్కారం కోసం కలెక్టరెట్ లో జరిగే ప్రజావాణి కి వచ్చే ప్రజల పట్ల జిల్లా యంత్రాంగం ఎప్పుడు సహాయ సహకరాలను అందిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రజావాణిలో సంబంధిత వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]