రైతులకు రుణమాఫీ ప్రక్రియ వేగవంతంగా పూర్తీ చేసి లబ్ది జరిగేలా చూడలని, సకాలంలో లక్ష్యాలను పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అన్నారు.గురువారం సమీకృత జిల్లా అధికారుల సముదాయాల సమావేశ మందిరంలో వ్యవసాయ రుణాలు, క్రాప్ లోన్లు, రైతు రుణ మాఫీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షా 20 వేల రూపాయల రుణ పరిమితి ఉన్న రైతులకు లక్ష రూపాయల పంట రుణమాఫీ చేసారని తెలిపారు. రుణమాఫీ జరిగిన రైతులకు నూతన రుణాల మంజూరు పై ఎస్.ఎల్.బీ.సి లో బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, సెప్టెంబర్ చివరి వరకు రుణమాఫీ జరిగిన ప్రతి రైతుకు నూతన రుణాల అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ జరిగిన ప్రతి రైతుకు నూతన రుణం అందే విధంగా యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బ్యాంకర్లకు తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ సంబంధించి సాంకేతిక సమస్యలు కారణంగా లబ్ది పొందని రైతులలో ఇతర బ్యాంకు ఖాతా వివరాలు లభించని జాబితా పంపామని, వ్యవసాయ విస్తరణ అధికారులచే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి సదరు రైతులకు కూడా రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనవసరమైన కారణాలు తెలిపి రైతుల ఖాతాలలో ఉన్న నగదును హోల్డ్ లో ఉంచకూడదని కలెక్టర్ బ్యాంకర్లకు తెలిపారు. రైతు రుణమాఫీ సంబంధించి చివరి రైతు వరకు లబ్ది చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని, బ్యాంకర్లు వద్ద నుంచి గ్రామం వారీగా రుణమాఫీ సమాచారం సేకరించి వ్యవసాయ విస్తరణ అధికారులచే క్షేత్రస్థాయిలో ప్రతి రైతు రుణ మాఫీ లబ్ది పోందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ధరణి కూడా ఒక భాగమే అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వెరిఫికేషన్ మాత్రమే చేస్తారని, మిగతా వివరాలు బ్యాంకు అధికారులు మాత్రమే తెలపాల్సి ఉంటుందని ఆమె అన్నారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, ఎస్.సి. కార్పోరేషన్ ఈ.డి. లక్ష్మి నారాయణ, వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!