in ,

అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి

అర్హులైన వారికి గృహలక్ష్మి మరియు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ(ఎంఎల్ )న్యూ డెమోక్రసి నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం చర్ల మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం తహసిల్దార్ రంగు రమేష్ గారికి,ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ గారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ఒక కులానికి పరిమితం కాకుండా అన్ని కులాలకి అర్హులైన వారికి ఇవ్వాలని,భూమిలేని పేదవారికి ప్రభుత్వమే భూమి ఇచ్చి గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని కోరారు.దళిత బంధు,బీసీ బందు పథకాలు పెట్టినట్టుగానే మైనార్టీలకు కూడా మైనార్టీ బంద్ పథకం పెట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు వచ్చిన పథకాలన్నీ అధికారా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే లబ్ది చేకూరింది తప్ప పేద ప్రజలకు ఎటువంటి లాభం చేకూరులేదని అన్నారు.ఈ కార్యక్రమంలో చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్,పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వీరమాళ్ల ఉమా,డివిజన్ నాయకులు వైయస్ రెడ్డి,బర్ల రామకృష్ణ,నరేష్,గౌస్,అరుణ హుస్సేన్ బి గౌసియా వెంకట నర్సు దుర్గ,బోయిన లక్ష్మి,ఆసిఫా, సయ్యద్ అమీనా,సయ్యద్ జరీనా తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

Trending Posts
Popular Posts
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

అక్రమ ఇసుక తవ్వకాలు ఆగడం లేదు.

రాత్రి 8 గంటల సమయంలో ‘ గుర్తు తెలియని దుండగుడు”