మహిళ మెడలో బంగారపు గొలుసు చోరీ
మహిళ మెడలో బంగారపు గొలుసు దోచుకుపోయిన ఘటన ఆదివారం మండల కేంద్రం జామిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. జామి బిసి కాలనీకి చెందిన కుమారి అనే మహిళ జామి హైస్కూల్ దగ్గర పండ్ల వ్యాపారం చేస్తూ ఉండేది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ' గుర్తు తెలియని దుండగుడు పండ్ల షాప్లో ఉన్న ఆమె మెడలోని తులంన్నర బంగారు గొలుసుని తెంపుకొని పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
[zombify_post]