-పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
గ్రివేన్స్ డే ఫిర్యాదులను విచారణ జరిపి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమస్యను పరిష్కారించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రివేన్స్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 25 ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదు చేశారు. వాటన్నింటిపై సత్వరమే చట్ట ప్రకారం విచారణ చేసి సమస్య త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా వరకట్న వేధింపు కేసులు, కుటుంబ తగాదాలు, భూమి వివాదాలపై ఫిర్యాదులు అందాయి. వీటిని చట్టపరిధిలో పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీపీ ఆదేశించారు.
[zombify_post]