రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమెకు ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో గంభీరావుపేట మండల రజక సంఘం అధ్యక్షులు గుండారం మహేందర్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువకు చాటి చెప్పి ప్రపంచ మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం దొరలను ఎదిరిస్తూ 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి రైతంగ సాయుధ పోరాటంలో రక్తాన్ని చిమ్మించి రైతాంగ సాయుధ పోరాటంలో నిప్పు కనికగా నిలిచిన చాకలి ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుడెపు రవి , గ్రామ రజక సంఘం అధ్యక్షులు బిక్షపతి, క్యాషియర్ రాజు, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]