మెంటాడ మండలం జయతి గ్రామ సమీపంలో ఉన్న గుండాల వలస మన్నెపురి కల్లాల్లో ఆదివారం వేకువ జామున ఓ రైతుకు చెందిన లేగ దూడ కనపడకపోవడంతో లేగ ను వెతుకుంటూ వెళ్లిన వారికీ పులి పాద ముద్రలు, దూడ రక్తపు మరకలు రైతులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా పులి మెంటాడ మండలంలో సంచరిస్తూ మూగ జీవాలపై దాడి చేస్తూ ప్రజలను రైతులను భయబ్రాంతులకు గురిచేస్తుంది. పులి సంచారం లేకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
[zombify_post]