in ,

కల్తీ డీజిల్ పోశారంటూ వాహనదారుల ఆందోళన

సత్తుపల్లి మునిసిపాలిటీలోని హనుమాన్ నగర్ వద్దనున్న కోటమ్మ హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద కల్తీ డీజిల్ పోశారంటూ వాహనదారులు ఆందోళన చేసిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొందరు కార్లు, లారీలలో డీజిల్ కొట్టించిన తర్వాత కొద్దిదూరం వెళ్లాక ఆగిపోవడంతో తిరిగి బంక్ వద్దకు చేరుకున్నారు. అనుమానం వచ్చిన వారు ఖాళీ బాటిళ్లలో డీజిల్ కొట్టించడంతో నీళ్లు కలిసిన డీజిల్ కనిపిం చింది. దీంతో వాహనదారులు ఆందోళన చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మండల రెవెన్యూ అధికారులకు సమాచారం అందిం చారు. శాంపిళ్లను సంబంధింత అధికారులకు పంపించి తనిఖీ చేయనున్నామని చెప్పడంతో వాహనదారులు శాంతించారు వెళ్ళి పోయారు.

[zombify_post]

Report

What do you think?

సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం:

హోంగార్డులను పర్మినెంట్ చేయాలి*