in ,

జిల్లాలో మారథాన్

  • కరీంనగర్ రన్నర్స్ అండ్ సైకిలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో అక్టోబర్ , 8, 2023 నాడు మారథాన్ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని శ్రీ గంగుల కమలాకర్ గారు, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఈ రోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో విడుదల చేస్తూ కరోనా మహమ్మారి అన్నిటికన్నా ముందు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని నేర్పిందని, ఇందుకు గాను ప్రతి పౌరుడు కూడా రోజులో కొంత సమయాన్ని శారీరక వ్యాయామానికి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆ అవగాహన కల్పించడం కోసమే కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ వారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారం తో అక్టోబర్ 8, 2023 నాడు నిర్వహించబోతున్నారని ఈ ఈవెంట్ లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి గారు అన్నారు.

    ఆ తరువాత కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుల మహేష్ మాట్లాడుతూ,  అక్టోబర్, 8, 2023 నాడు 3 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ., మరియు 21 కి.మీ., మారథాన్ ప్రతిష్టాత్మక కేబుల్ బ్రిడ్జి నుండి ప్రారంభం అవుతుందని, ఈ ఈవెంట్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. మారథాన్ లో పాల్గొనే వారికి టీ షర్ట్, మెడల్ మరియు డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. అంతే కాకుండా మారథాన్ లో పాల్గొన్న వారి కోసం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఈవెంట్ లో పాల్గొనే వారు ఖచ్చితంగా గా రన్ చేయాల్సిన అవసరం లేదని, జాగింగ్ లేదా వాకింగ్ కూడా చేయవచ్చని, కాబట్టి  ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. రన్నింగ్ / జాగింగ్ / వాకింగ్ చేసే దారిలో న్యూట్రీషన్ సహకారం కూడా ఉంటుందని తెలిపారు.
    3 కి.మీ., 5 కి.మీ., రిజిస్ట్రేషన్ కి రూ.300/_ మరియు 10 కి.మీ., 21 కి.మీ., లకు రూ.500/_ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందని, రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వాలని మహేష్ తెలిపారు. ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం కోసమే కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ వారు ఈ మారథాన్ నిర్వహించడానికి ముఖ్య కారణమని తెలిపారు.

    కరీంనగర్ మారథాన్ పోస్టర్ విడుదల కార్యక్రమం లో శ్రీ బి. గోపి గారు, జిల్లా కలెక్టర్, శ్రీ సుబ్బారాయుడు గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ జిల్లా కలెక్టర్ మరియు  శ్రీ సునీల్ గారు, కరీంనగర్  పట్టణ మేయర్ లతో పాటు, శ్రీ మహిపాల్ గారు,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీ గంప వెంకట్, వి కన్వెన్షన్ ఓనర్,  శ్రీ కిరణ్  కుమార్, వెటర్నరీ డాక్టర్, శ్రీమతి పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి, శ్రీమతి హేమ భట్, శ్రీమతి స్వప్న, శ్రీమతి విమల, శ్రీ రవీందర్, స్పోర్ట్స్ అడ్వెంచర్ మరియు శ్రీ ప్రవీణ్ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Rajendra

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts

విద్యతోపాటు విలువలు పెంచేదే బాలసాహిత్యం

హైకోర్టు లో ఘ‌నంగా బోనాల ఉత్సవాలు…