జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దుస్స వెంకటేశ్వర్లు, సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు చిల్లపల్లి మాధవరావు, రజక సంఘాల జిల్లా నాయకుడు బలుసుపాటి దను. తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శప్రాయురాలు చాకలి ఐలమ్మ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దుసా వెంకటేశ్వర్లు అన్నారు ఆదివారం నాడు చాకలి ఐలమ్మ 38 వ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరకు శ్రీనివాస్ పిలుపు మేరకు సత్తుపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లో గలా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పులా మాలలు వేసి ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ముందుగా ఆమె విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు, సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు చిల్లపల్లి మాధవరావు, సిపిఐ నాయకులు దండు ఆదినారాయణ, రజక సంఘం నాయకులు బలుసుపాటి ధనులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, ఆనాడు ముసునూరు దొరలపై వీరోచిత పోరాటం చేసి పది లక్షల ఎకరాలను పీడిత ప్రజలకు పంచిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని వారు కొనియాడారు. గత వర్ధంతి సభలో గౌరవ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో వారు చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేశామని వారి స్ఫూర్తితోనే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని మాట్లాడారు. ఆటువంటి నేపథ్యంలో ఒక మహిళగా దొర పెత్తనానికి వ్యతిరేకంగా వెట్టిచాకిరి ని వ్యతిరేకిస్తూ చేసినటువంటి పోరాటాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి అని, అటువంటి ధీరవనిత ఎంతో మందికి స్పూర్తి నింపే అవకాశం ఉందని కాబట్టి భవిష్యత్ తరాలకు ఆమె యొక్క వీరత్వం చరిత్ర భవిష్యత్ తరాలకి తెలిసేవిధంగా పాఠ్యపుస్తకాల్లో ఆమె ఒక చరిత్రను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ఈ రాష్ట్రాన్ని సాధించామని ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులకి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ట్యాంక్ బండపై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణవరపు రామకృష్ణ, రాయల కృష్ణ, వల్లూరి శ్రీను, బలుసుపాటి కృష్ణ, పంతoగి వెంకటేశ్వరరావు, పంతంగి నాగేంద్ర రావు, సాంబ, సాయి, వల్లూరు మహేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]