అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుండి ఏలేశ్వరం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఆరు తులాల బంగారం చోరీ కి గురైంది. బుధవారం సీతామహాలక్ష్మి అని మహిళ రాజవొమ్మంగి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.ఈ నేపథ్యంలో ఆమె బ్యాగ్ లో ఉన్న బంగారం మాయం అవడంతో అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన గొలుగొండ ఎస్సై నారాయణ రావు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో సిసి ఫుటేజ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
[zombify_post]