దళిత బంధు గ్రౌండింగ్ చేయకుండ దళితులను ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ ఎస్ పార్టీకి లేదని
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపికలో ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండ, అవినీతికి తావులేకుండ పారదర్శకత కోసం కంప్యూర్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని చెబుతున్న మంత్రి కేటీఆర్ పారదర్శకత కేవలం డబుల్ బెడ్ రూం పథకానికేనా..అన్ని సంక్షేమ పథకాలకు వర్తిస్తుందా సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో అర్హులందరికి ఇళ్ల కేటాయింపు, స్థల సేకరణ చేపట్టామని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూం పథకం కనుమరుగైందన్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు బీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించినవేనని అన్నారు.
[zombify_post]