జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్.జగ్జీవన్ కుమార్ ఆధ్వర్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా మొత్తం 11 లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేశారు. ఖమ్మంలో ఏడు జాతీయ లోక్ అదాలత్ బెంచీలను న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ విజయవంతం చేయటానికి నెలరోజుల ముందు నుంచే జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్ జగ్జీవన్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారు. గత వారం రోజుల నుండి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కే ఉమాదేవి ఆ సమావేశాల ఒరవడిని కొనసాగించి లోక్ అదాలత్ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు. న్యాయమూర్తులు డి రాంప్రసాదరావు, ఎన్ అమరావతి, కె దీప, వి మాధవి, ఆర్ శాంతిలతా లు లోక్ అదాలత్ బెంచీలకు అధ్యక్షత వహించి కేసులను పరిష్కరించనున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దిరిశాల కృష్ణారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎం లక్ష్మీనారాయణ, విజయ రాఘవ, జి అమర్నాథ్, వి అరుణ, ఆర్ వెంకట్, కే వి వి లక్ష్మీ, ప్రవీణ్ కుమార్ లు లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
[zombify_post]