ఇంటివద్ద పెట్రోల్ బాటిల్ తో హోంగార్డు ఆందోళన కల్లూరులో ఘటన
ఓ భూ వివాదం కేసులో సస్పెన్షన్ కు గురైన హోంగార్డు ఒకరు కల్లూరులో ఇంటి వద్ద పెట్రోల్ బాటిల్ పట్టుకుని కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగాడు. ఈ సంఘటన కల్లూరు మండల కేంద్రంలో జరిగింది. స్థానిక అంబేడ్కర్ నగర్ కు చెందిన రాంబాబు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కల్లూరులో గల 8గుంటల భూమి విషయంలో రాంబాబు కుటుంబానికి, మరో నలుగురి మధ్య భూ వివాదం గతంలో జరిగింది. దీనిపై ప్రత్యర్థి వర్గం వారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రాంబాబుతో పాటు అతడి తల్లిదండ్రులపై గత మార్చిలో కల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సదరు హోంగార్డు సస్పెన్షన్ కు గురయ్యాడు. దీంతో భూవివాదం కేసులో తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి హోంగార్డ్ గా ఉన్న తనను విధుల నుంచి తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ జిల్లా వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ లు పెట్టారు. ఆ మెసేజ్ లు కలకలం రేపగా.. రాంబాబు పెట్రోల్ బాటిల్ తో తన ఇంటి వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. ఆందోళనకు దిగిన రాంబాబు అయితే తనకు భూమి కావాలో, ఉద్యోగం కావాలో తేల్చుకోవాలని పోలీసులు తనపై ఒత్తడి చేసి చివరకు సస్సెండ్ చేయించారని ఆరోపించాడు. తన కుటుంబం మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోంగార్డుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశాడు. ఈ సంఘటన గురించి కల్లూరు ఎస్ఐ పి.రఘు వివరాలు సేకరించారు.
[zombify_post]