in , ,

భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం

విశాఖపట్నం: నగరం మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న విదేశీ సిగరెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు.వాహనంలో విదేశీ సిగరెట్లు అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ త్రినాథరావు నేతృత్వంలో ఆనందపురం వద్ద తనిఖీలు నిర్వహించారు. వాహనంలో 6.60 లక్షల విదేశీ సిగరెట్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. వీరి వద్ద గుట్కా కూడా ఉన్నట్లు సమాచారం. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం ఆనందపురం పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.

[zombify_post]

Report

What do you think?

*ఇంట్లో మంచి నీరు నిల్వ ఉండొద్దు*

సలుగు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ సస్పెండ్