విశాఖ: బోగస్ ఓట్లు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్ధానాల్లో ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే అంశంపై ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారని.. ఫలితంగానే ఇంటింటి సర్వేజరుగుతోందన్నారు. ఉత్తర నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డుల్లో బోగస్ ఓట్లు ఉన్నట్లు ప్రాధమికంగా తేలిందని, దీనిపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బోగస్ ఓట్ల తొలగింపులో అధికారులు అలసత్వంగా ఉంటే చర్యలు తీసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమనే ఉద్దేశంతోనే వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఒక్కో డోర్ నెంబర్‌పై గరిష్టంగా 200 ఓట్లు ఉన్నాయంటే అక్రమాలు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఏపీలో విధ్వంసం తప్ప అభివృద్ది లేదన్నారు. పథకాల అమలులో 98.5 అమలు చేయడం కాదని.. 98.5 శాతం జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
[zombify_post]