in

23 నెలల ఏరియార్స్ వెంటనే విడుదల చేయాలి

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కరించాలని రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. సిపిఐ జిల్లా నాయకులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కరించాలని, 11 వేజ్ బోర్డు వెజ్ బోర్డులో 23 నెలల ఏరియాస్ ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల వాటాలో 35% కార్మికులకి ఇవ్వాలని, సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలని, సత్తుపల్లిలో క్వార్టర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలో బ్రాంచ్ కార్యదర్శి సముద్రాల సుధాకర్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ దారా భీమయ్య, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి సూర్య ప్రకాష్ , బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి భరణి, బ్రాంచ్ కోశాధికారి దమ్మలపాటి నర్సింహ్మ రావు, కిష్టారం పిట్ కార్యదర్శి కిషోర్ కుమార్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి అజ్మద్, జె.వి.ఆర్ పిట్ కార్యదర్శి జి.నర్సింహ్మ రావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి బరిగెల శేఖర్, బి సుధాకర్, మధుకుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

వాషింగ్టన్ లో వైట్ హౌస్ సందర్శించిన కరణంరెడ్డి నరసింగరావు”