– నంబూరి రామలింగేశ్వరరావు
-బీజేపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్
సత్తుపల్లి శాసనసభ వెంకట వీరయ్య ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించిన తీరు హర్షించదగిన విషయం. కానీ చంద్రబాబు అరెస్టు కాబడి రెండు రోజులు అవుతుంది. ఆయన మీద ప్రేమే ఉంటే అరెస్ట్ అయిన రోజే ఖండించి ఉండాలి. అలా కాకుండా ఖండించాలా వద్దా అని 2రోజులు ఆలోచించి లేటుగా ఆయన ఈరోజు ఖండించారు. గతంలో మీకు రాజకీయ బిక్ష పెట్టారు కాబట్టి మీరు స్పందించడంలో తప్పులేదు, కానీ రాజకీయ అవగాహన లేకుండా నరేంద్ర మోడీ ఇది చేయించారు, జగన్మోహన్ రెడ్డితో కలసి అని మీరు అనటం చాలా హస్యాస్పందంగా ఉంది. దేశంలో మోడీ ఇప్పటివరకు ఎవరిపైన అయిన కక్షపూరితమైన చర్యలకు పాల్పడినట్టు మీరు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాము, ఏదో ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంకు పొందాలని సింపతి కోసం నింద మోడీ గారిపై వేసి గుంపాగతు గా ఓట్లు పొందాలనుకోవడం మీ అవివేకం. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ గా చేశారు మీ కన్నా ముందు నుంచి బిజెపిలో ఉన్నారు. బిజెపిని విభేదించి అప్పటి యూపీఏ ప్రభుత్వంతో చేతులు కలిపి ఎలక్షన్స్ కి వెళ్లారు దేశవ్యాప్తంగా తిరిగి నరేంద్ర మోడీ ని ఓడగొట్టాలని ప్రచారం చేశారు. అయినా గాని ఏనాడు చంద్రబాబు నాయుడుని మోడీ పన్ను ఎత్తు మాట అనలేదు. అయినా ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. అలాంటి రాజకీయాల్లో బిజెపి వేలు పెట్టదు, మీ కన్నా ముందే మా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా బాబు అరెస్ట్ ని ఖండించారు. ఈరోజు బండి సంజయ్ కూడా ఖండించారు. అలాగే మేము కూడా ఖండిస్తున్నాం, కక్షపూరిత రాజకీయాలు ఎవరు చేసినా అది తప్పే, దయచేసి ఒక వర్గం ఒక మతం ఒక కులం ఓట్లు కోసం అనవసరమైన బురద మోడీ మీద పోయి మాకండి.
[zombify_post]