in , , ,

విభిన్నం….. ఈ గిరిజనుల జీవనం

అరుకులోయ నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా : అన్నెం పున్నెం ఎరుగని అమాయక గిరిజనం….. వీరి జీవనం విభిన్నం. గిరుల్లో…. విరుల్లో… ఝరుల్లో…. విహరిస్తూ తమదైన ఆచార సంప్రదాయాలను ఇప్పటికీ అవలంభిస్తూ బ్రతుకు జీవనాన్ని కొనసాగుతున్నారు ఈ బొండాజాతి గిరిజనులు….. నవీన పోకడలకు భిన్నంగా తమ విశిష్ట వైవిధ్య భరిత జీవనాన్ని ప్రకృతి ఒడిలోనే నేటికి సాగిస్తున్నారు ఈ బొండాజాతి గిరిజనులు. స్వచ్చమైన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. నేటి సమాజానికి, మార్పుల ప్రభావానికి కొంత లోనవుతున్నా…. తమ ఉనికిని చెక్కు చెదరకుండా కాపాడుకోవడానికి ఆరాటపడుతుంటారు ఈ అడవి బిడ్డలు. బొండాజాతి గిరిజనుల ఆకర్షణ: మన్యంలోని ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులోని అతి మారుమూల ఉన్న జోలాపుట్టు సమీపంలోని మాచ్ ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు పరిధిలో సుమారు 10 వరకు బొండాజాతి గిరిజనులు నివశిస్తున్నారు. పురుషులు‌, మహిళలు కూడా పూసలనే బట్టలు గా ధరిస్తుంటారు. గతంలో అసలు దుస్తులే ధరించేవారు. కానీ ప్రస్తుతం సమాజంలోని మార్పులు వల్ల వీరు కొంతమేర మారుతున్నారు. రామాయణం కాలంలో అడవి పాలైన సీత స్నానం చేస్తుండగా చూసి నవ్వడంతో ఆమె శపించిందని, అప్పటి నుండి తమ వంశీకులు ఇలా బట్టలు వేసుకోకుండా పూసలు ధరిస్తున్నారనే కథ ప్రచారంలో ఉంది. అయితే వీరు తమ గ్రామానికి ఇతరులను రానివ్వరు. ఇలా పరాయి వాళ్ళు తమ గ్రామానికి వస్తే ఏదో కీడు సంభవిస్తుందనేది వీరి నమ్మకం… అలాగే వీరిని చూసి ఎవ్వరైనా నవ్వితే… వారిని ఈటెలతో పొడిచి చంపేసేవారు. అయితే నేడు వీళ్ళలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడిపుడే వీళ్ళలో కొంతమంది బడులకు వెళ్ళి చదువుకోవడం చేస్తున్నారు. వీళ్ళకి జీవనాధారం కొండపోడే…. వీళ్ళు పండించిన పంటలను సమీపంలోని జోలాపుట్టు లో ఆదివారం జరిగే వారపు సంతకు తీసుకువచ్చి విక్రయాలు జరిపి వీరికి కావాల్సిన నిత్యావసర సరుకుల కొనుగోలు చేసుకుంటారు. వీరు జీలుగు కళ్ళును అతి ఇష్టంగా సేవిస్తూంటారు. ఆడ, మగ తేడా లేకుండా వీళ్ళు జీలుగు కళ్ళు తాగుతుంటారు. చిన్న పిల్లలకు కూడా పట్టిస్తుంటారు. ఇలా చేయడం వల్ల దృష్ట శక్తులు వీరి దరిదాపులలోకి కూడా రావని వీరి నమ్మకం. గతంలో వీళ్ళను ఎవ్వరైనా ఫోటోలు తీస్తే ఒప్పుకునేవారు కాదు. కానీ విదేశీయులు వీరితో ఫోటోలు దిగి డబ్బులు ఇస్తుండటంతో రాను రాను వీళ్ళు కూడా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆదివారం జోలాపుట్టు వారపు సంతకు వచ్చే బొండాజాతి మహిళలతో ఫోటోలు తీసుకునేందుకు విదేశీయులతో పాటు స్థానికులు కూడా పోటీ పడుతుంటారు.

[zombify_post]

Report

What do you think?

వెదురుకంజి కూర టేస్టే వేరు

నేటికి గుర్రాలే వారికి రవాణా సాధనాలు