in ,

అల్లూరి జిల్లా లో ప్రబలిన విష జ్వరాలు

అరుకులోయ నియోజకవర్గం అరుకులోయ మండలం బస్తీకి పంచాయతీ బిజగూడ గ్రామంలో విషజ్వరాలు వ్యాపించడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైద్య అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణం.
బిజగూడ గ్రామంలో గ్రామంలో సుమారు 35 గిరిజన పివిటిజి కుటుంబాలు జీవిస్తున్నారు. కలుషిత నీరు తాగడం, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరు ఎక్కడకక్కడే నిలిచి పోవడంతో దోమలు బెడద ఎక్కువైంది.దీంతోనే, మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో ఇద్దరు ముగ్గరు చిన్న పిల్లలతో సహా తల నొప్పులు, జ్వరం, కాళ్లువాపు, ముఖం వాపు రావడం వంటి వ్యాధి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని బస్కి పంచాయితి బిజగుడ గ్రామంలో మంచి తాగు నీరు సమస్య తీవ్రంగా ఉంది. గతంతో ఊట గడ్డ నుండి‍ గ్రావిగ్‌ స్కీంతో మంచి నీరు ట్యాంక్‌ నిర్మించారు. ప్రస్తుతం ట్యాంక్‌ పూర్తిగా శిధిలావస్థలోచేరడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పూర్తిగా బురద నీరు ట్యాంక్లో చేరుతుంది. దీంతో, నీరు కలుషిత అవుతుంది. గ్రామంలో మంచినీరు లేక ఆ కలుషితమై నీరు తాగి అనారోగ్యాలు పాలవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి గ్రావిటి పథకం మరమ్మతు చేపట్టి మంచినీరు అందించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

అద్భుతంగా సాగిన”శరణం గచ్ఛామి”కళా రూపం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం.. రెండు బైక్​లు ఢీ.. ముగ్గురు దుర్మరణం