in , , ,

వెదురుకంజి కూర టేస్టే వేరు

   పాడేరు నియోజకవర్గం , అల్లూరి సీతారామరాజు జిల్లా        :    ప్రస్తుతం మన్యంలో వారపు సంతలోవెదురు కంజి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి   వెదురు కంజిని కొనేందుకు గిరిజనులు అధికంగా ఎగబడటం హాట్ కేకుల్లా గా అమ్మకాలు జరుగుతున్నాయి వెదురు కంజిఅంటే ఏమిటంటే లేత వెదురు నుంచి తీసిన చిగురు వెదురును వెదురు కంజి అంటారు అటవీ ప్రాంతంలో ఉన్న వెదురును కత్తరించి చిగురు వెదురును సేకరిస్తారు ఈ చిగురు వెదురును మారుమూల ప్రాంతాల గిరిజనులు వారపు సంత లకు తీసుకోవచ్చు వాటాలుగా అమ్మకాలు చేపడుతుంటారు ఒక వాటా 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అమ్ముతుంటారు వెదురు కంజి లో రెండు రకాలు గా కూరలు తయారీకి వినియోగిస్తారు పచ్చి వెదురు కంజి ని ఒకరకంగా కూర తయారు చేస్తారు వెదురు కంజి ని ఎండబెట్టి మరో విధంగా కూర తయారీకి వినియోగిస్తారు పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే కూర తయారు చేసుకోవాలి ,ఎండ పెట్టుకుంటే  ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారీకి వినియోగించవచ్చు అయితే ఈ వెదురు కంజి కూరను గిరిజనులంతా మరి ప్రీతిగా తింటారు ముఖ్యంగా గర్భిణీలు ఈ కూర తినడం ద్వారా సుఖప్రసవం అవుతారని గిరిజనుల నమ్మకం .వైద్యులు కూడా ఈ వెదురు కంజి కూరలు తింటే వ్యాధి నిరోధక శక్తి నిపెంచే గుణం ఉంటుందని చెబుతున్నారు దీనికితోడు శరీరాన్ని ఈ కూర వెంటనే వేడి చేస్తుందని ,కొద్దిగా కూర తో ఎక్కువ అన్నాన్ని తినేందుకు అవకాశం ఉంటుందని ,గిరిజన ప్రాంతంలో జరిగే కొన్ని పండగలకు వెదురు కంజి కొనలేనిదే పండగ జరగదు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గిరిజన ప్రాంతంలో వెదురు కంజి యొక్క ప్రాముఖ్యత .

[zombify_post]

Report

What do you think?

ఈనెల 11న మండలం పరిషత్ సమావేశం

విభిన్నం….. ఈ గిరిజనుల జీవనం