in ,

తాడేపల్లి ప్యాలెస్ కుట్రలతో యువగళం పాదయాత్రను ఆపలేరు. బొజ్జల సుధీర్ రెడ్డి.

  1. శ్రీ కాళహస్తి. 

    భీమవరంలో లోకేశ్ పాదయాత్రపై వైసీపీ మూకలు కవ్వింపు చర్యలకు దిగి ఘర్షణలను సృష్టిస్తే పోలీసులు మాత్రం యువగళం వలంటీర్లపై కేసులు నమోదు చేయటం దుర్మార్గమన్నారు. యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటాన్ని చూసి ఓర్వలేక
    తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో యవగళం పాదయాత్రకు అడుగడుగునా వైసీపీ నేతలే ఈ దాడులకు పురిగొల్పుతు అడ్డంకులు సృష్టిస్తున్నారని శ్రీ కాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు.  గురువారం మిడియా తో మాట్లాడుతూ జగన్ రాక్షసపాలనలో పోలీసులు తమ స్వామిభక్తిని చాటుకున్నారని, మరోసారి బాధితులే నిందితులయ్యారన్నారు. వైసీపీ అల్లరి మూకలు, గూండాలు యువగళం వలంటీర్లపై దాడిచేస్తే, నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు అర్ధరాత్రి యువగళం క్యాంపుపై దాడిచేసి అరెస్టు చేయటం అత్యంత దుర్మార్గమన్నారు. దాడి జరిగినప్పుడు పోలీసులు, అల్లరిమూకలకు అండగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. అరెస్టు చేసిన యువగళం కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువగళం పాదయాత్ర భగ్నం చేసేందుకు సీఎం జగన్ అడుగడుగునా కుట్రపన్నుతూనే ఉన్నాడన్న విషయాన్ని భీమవరం ఘటనతో మరోసారి రుజువైందని, కవ్వింపు చర్యలకు పాల్పడిన గూండాలను వదిలి వేసి యువగళం వలంటీర్లను అరెస్టు చేయటం రాష్ట్రంలో సాగుతున్న ఏకపక్ష పోలీసింగ్కు నిదర్శనమన్నారు. ఈ అరాచకాలకు కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, గతంలో టీడీపీ పాలనలో తామూ ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవాడా? అని ప్రశ్నించారు. పోలీసుశాఖ జగన్ సొంత శాఖలా మారిందని, గతంలో ఎన్నడూ వ్యవహరించని రీతిలో నేడు పోలీసులు వ్యవ హరిస్తున్నారని, వైసీపీ కార్యకర్తల్లా కాకుండా చట్ట బద్దంగా ప్రజలకు రక్షణగా ఉండాలని సూచించారు. కొన్ని నెలల్లో రాష్ట్రం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మారటం తథ్యమని బొజ్జల సుధీర్ స్పష్టం చేశారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Eswaraiah

Creating Memes

సారధి తీరు అనైతికం. కాసరం రమేష్

1532 కేజీల పిడిఎఫ్ బియ్యాన్ని స్వాధీనం