in ,

సారధి తీరు అనైతికం. కాసరం రమేష్

*సారధి తీరు అనైతికం*
*-కాసరం రమేష్*

శ్రీ కాళహస్తి…

తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు అటు తెలుగుదేశం పార్టీని, ఇటు బొజ్జల కుటుంబాన్ని అన్ని విధాలుగా వాడుకొని, తన స్వార్ధ పూరితమైన రాజకీయ అవసరాల కోసం బొజ్జల కుటుంబంపై నీతి మాలిన వ్యాఖ్యలు చేస్తున్న పార్థసారథి తీరు అనైతికం అని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కాసరం రమేష్ ఆరోపించారు.
2005 వ సంవత్సరం జరిగిన శ్రీకాళహస్తి పురపాలక సంఘం జనరల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్ గా పోటీ చేసి గెలవడం ద్వారా సారథి బొజ్జల కుటుంబాన్ని మచ్చిక చేసుకొని, వారి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా చెప్పుకుంటూ, తన రాజకీయ ఎదుగుదలకు అడ్డు రాకూడదని అప్పటికే ఉన్న ఎంతో మంది కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన ఘనుడు సారధి కాదా అని రమేష్ ప్రశ్నించారు.
దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కి అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా నటిస్తూ చిన్నతనంలోనే పట్టణ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ మరియు శ్రీకాళహస్తి ప్రాంతీయ వైద్యశాలలో సలహా కమిటీ చైర్మన్ మొదలైన పదవులను అనుభవించడానికి తెలుగుదేశం పార్టీ కారణం కాదని సారధి చెప్పగలడా అని రమేష్ ప్రశ్నించారు.
సారథి తన స్వప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను స్థానిక శాసనసభ్యుల వద్ద తాకట్టు పెట్టిన తీరు చాలా బాధాకరం, దురదృష్టకరం అని రమేష్ పేర్కొంటూ… సారధి తీరును శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు  జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీలో తన నియంతృత్వ పోకడలతో ఎంతోమంది సీనియర్ నాయకుల పైన తప్పుడు మాటలు చెప్పి  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కి ఇతర సీనియర్ నాయకుల మధ్య పూడ్చలేని ఆగాదం ఏర్పరిచింది ఈ సారధే అని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులలో ఎవ్వరిని అడిగినా చెబుతారని రమేష్ తెలిపారు.
ఈ ఆణిముత్యం సారధి తనకు సమకాలీకుడిగా ఉన్న నా మీద కూడా లేనిపోని అబాండాలు మోపి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపే దిశగా ప్రణాళిక రచించింది వాస్తవం కాదా అని రమేష్ ప్రశ్నించారు.
అందరిని ఏకవచన సంబోధనతో ఎంతోమంది సీనియర్లను తెలుగుదేశం పార్టీకి దూరం చేసి, అత్యంత విషపూరితమైన స్వార్ధ రాజకీయాలకు కేంద్ర బిందువుగా సారధి ఉండేవాడని రమేష్ ఆరోపించారు. పై విధంగా బొజ్జల కుటుంబం అండదండలతో ఎదిగిన సారధి, నైతిక విలువలను మరచి బొజ్జల కుటుంబం పై నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని రమేష్ ఆరోపించారు.గతంలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి  మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు స్వర్గీయ పోతుగుంట గురవయ్యనాయుడు గారు చొరవ తీసుకొని శ్రీకాళహస్తిని ప్రగతి పథంలో నడిపించాలన్న సంకల్పంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి పరచి తద్వారా భక్తజన కోటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మాస్టర్ ప్లాన్ ను రూపొందించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొందడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు అమలు చేయదలచిన మాస్టర్ ప్లాన్ కు అవసరమైన స్థలాలను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు సమ్మతిస్తూ తమ ఆస్తులను దేవస్థానానికి అప్పగించించడానికి ముందుకు వచ్చిన స్థానికులలో ఎక్కువ భాగం పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని రమేష్ గుర్తు చేశారు.మాస్టర్ ప్లాన్ కు విరుద్దంగా ముత్యాల పార్థసారధి కుటుంబీకులు నిర్మించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే సారధి ఈరోజు స్ధానిక శాసనసభ్యుడి వద్ద మోకరిల్లాడనే విషయం అక్షర సత్యం అని రమేష్ గుర్తు చేశారు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత శాసనసభ్యులపైన అవాక్కులు, చవాక్కులు మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి, అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సారధి, నేడు దిగజారుడు రాజకీయాలను ప్రతిబింబిస్తూ మధుసూదన రెడ్డి పంచన చేరడానికి గల కారణాలను వారిరివురే చెప్పాలని రమేష్ డిమాండ్‌ చేశారు. కావున గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవో లకు తూట్లు పొడిచిన ప్రస్తుత శాసనసభ్యుల చర్యలను అదుపుచేసి, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన  వెంటనే యధావిధిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జారీ చేసిన మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన జీవోలను బొజ్జల సుధీర్ రెడ్డి అమలు పరచి అందరికీ ఒకే న్యాయం దక్కేలా చూడడం జరుగుతుందని రమేష్ విన్నవించారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Eswaraiah

Creating Memes

ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య సేవలు

తాడేపల్లి ప్యాలెస్ కుట్రలతో యువగళం పాదయాత్రను ఆపలేరు. బొజ్జల సుధీర్ రెడ్డి.