అవనిగడ్డ సీతాయలంకలో అగ్ని ప్రమాద బాధితులకు బీసీ సంక్షేమ సంఘం తరపున ఆర్థిక సాయం అందించారు. కేసన దానయ్య, సూరగం నాగమల్లి కుటుంబాలకు నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘ అధ్యక్షులు చెన్ను రంగారావు ఆధ్వర్యంలో బుధవారం రెండు కుటుంబాలకు రూ. 25 వేల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్పంచ్ దాసరి విజయ్ కుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పులిగడ్డ పిచ్చేశ్వరరావు, సంఘ జిల్లా అధ్యక్షులు అందే జగదీష్, మాజీ సర్పంచ్ చెన్ను గాంధీ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అవనిగడ్డ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదుకు చెందిన యన్ మ్యాక్స్ ఇంజనీరింగ్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ రూ. 5 వేలు, గ్లోబల్ ఇన్వార్మెంటల్ సిస్టం ప్రవేట్ లిమిటెడ్ అధినేత కొండా శ్రీరామ్ రెడ్డి రూ. 5 వేలు, మల్లేశ్వరం సర్పంచ్ చెన్ను శ్రీనివాసరావు అలాగే చిన్ను రంగారావు లు సంయుక్తంగా రూ.15 వేలు అందించినట్లు రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా రంగారావు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
[zombify_post]