గర్భిణీలు, బాలింతలకు సౌకర్యవంతమైన సేవలు అందించటమే లక్ష్యమని ఐసీడీఎస్ సీడీపీఓ భానుమతి తెలిపారు. చల్లపల్లి పార్వతమ్మ తోట అంగన్వాడీ కేంద్రం అసౌకర్యంగా ఉన్న నేపథ్యంలోనే సౌకర్యవంతమైన అద్దె భవనానికి మార్చుతున్నట్లు భానుమతి తెలిపారు. గురువారం పార్వతమ్మ తోట అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ సందర్శించి, గర్భిణీలు, బాలింతలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీలో తగిన సౌకర్యాలు లేవని, కేంద్రానికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, పిల్లల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ ఆదిలక్ష్మి, మహిళా పోలీస్ వేమూరి లావణ్య పాల్గొన్నారు.
[zombify_post]