టీడీపీ అన్న క్యాంటీన్క రూ.1 లక్ష వితరణ
టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాలి, టెక్కలిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిర్వహణకు విశాఖపట్నంకు చెందిన జీ.వీ రామచంద్రరావు అనే టీడీపీ సానుభూతిపరుడు గురువారం నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడుకు రూ. 1 లక్ష చెక్కును అందించారు. పేదలకు అండగా నిలుస్తూ అన్న క్యాంటీన్ ద్వారా పేదల ఆకలిని తీరుస్తున్న నేపద్యంలో తన వంతు సహాయంగా చెక్కును అందించినట్లు ఆయన తెలిపారు..చంద్రబాబు గారు అంటే స్ఫూర్తిని యువతకి ఆదర్శంగా నిలుస్తారని రాబోయేది తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు ప్రజలందరూ పండగ చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలంటూ పిలుపునిచ్చారు
[zombify_post]