ఎస్. జి పేటలో పొలంబడి కార్యక్రమం
ఎస్కోట మండలం ఎస్. జి పేటలో గ్రామ వ్యవసాయ సహాయ అధికారి రవి ఆధ్వర్యంలో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. 6వ వారం పొలంబడి కార్యక్రమంలో భాగంగా ఈషా పొలంలో విభజించిన రైతు గ్రూపులు సేకరించిన కీటకాలను 2జె చార్టు మీద శత్రు పురుగులను, మిత్ర పురుగులను విభజించి, ఆ కీటకాలను భద్రపరిచే విధానాన్ని రైతులకు వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏవో రవీంద్ర పాల్గొనగా, విఏఏలు వివేక్, భాస్కర్ పాల్గొన్నారు.
[zombify_post]