పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ చీడిపుట్టు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్న జంప్రంగి లలిత శంకరం మాస్టారు శుక్రవారం గుండుపోటుతో తరగతి గదిలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. పాడేరు శాసనసభ్యులు కొట్టకుల్లి భాగ్యలక్ష్మి సీకరిలోని లలిత శంకర మాస్టర్ స్వగృహం వద్దకు వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మాస్టారు కుటుంబాన్ని ఓదార్చారు. ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే లలిత శంకరం మాస్టారు మనకు దూరం కావడం నిజంగా దురదృష్టకరమని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షకులుగా పొందిన శంకర మాస్టర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థించినట్లు తెలిపారు
[zombify_post]