ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర ధరలను తగ్గించాలని సిపిఎం దేశవ్యాప్త నిరసన కార్యక్రమం పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా గురువారం సిపిఎం పార్టీ చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి కారం నరేష్ మాట్లాడుతూ దేశంలో రోజుకు రోజుకి నిత్యవసర సరుకులు ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయని బియ్యం ధరలకు పప్పు ధరలకు కొండెక్కియని కూరగాయలు నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు గగ్గోలు పడుతున్నారని దేశంలో కోట్లాది మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని వీరిపై పన్నుల భారం మరింత పెంచి దారిద్ర్యంలోకి పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.నిత్యవసర సరుకులు ధరలు 2014లో ఉన్న ధరలను పరిశీలిస్తే 55% నుంచి 200% వరకు సరుకులు ధరలు పెరిగాయని ఈ నెలలోనే 37% ధరలు పెరిగాయని అన్నారు గ్యాస్ ధరలు నేడు 1200 కు పెరిగిందని ఇదే అదునుగా కార్పోరేట్ వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారని ధరలు అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదని కానీ అవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.బిజెపి ప్రభుత్వంలో కనీస జీవనాధారం ఉన్న ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గించారని గ్రామీణ ప్రాంతాల్లో 40% ప్రజలు పౌష్టిక ఆహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని 57% మహిళలు 67% పిల్లలు రక్తహీనత బాధపడుతున్నారని మానవ వనరుల అభివృద్ధి సర్వే సూచిక పేర్కొన్నదని ఇది దేశ అభివృద్ధికి ఆటంకమని అన్నారు.బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ తప్పిందని నిరుద్యోగులు ఉపాధి లేక డిగ్రీలు పీజీలు చదివిన వారు కూలి పనులకు వెళ్తున్నారని, నరేంద్ర మోడీ హామీ నిలబెట్టుకోవాలని రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం తెలంగాణకు అనేక వాగ్దానాలు చేసిందని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిజామాబాద్ లో పసుపు బోర్డు రాష్ట్రాన్ని గిరిజన యూనివర్సిటీ రాష్ట్రంలో మూడు ఎయిర్పోర్ట్ లు చేనేత జిఎస్టి వంటి ఊసే లేదని రాష్ట్ర ప్రభుత్వం 2006 అట్టివాకుల చట్టం ప్రకారం 11.5 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాల్సింది నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చారని దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు భూమి ఇవ్వలేదని గృహలక్ష్మి ఇండ్లకు సంబంధించి అర్హులకు అనేక ఆంక్షలు విధించారని దళిత బంధు అవినీతి జరిగిందని బీసీ బందు ఇష్టారాజ్యంగా ఎంపిక జరిగిందని విద్య వైద్యం సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని పేదలందరికీ స్థలాలు కల్పించాలని చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మచ్చ రామారావు,పొడుపు గంటి సమ్మక్క,బందెల చంటి తాళ్లూరు కృష్ణ,సారోను సూరమ్మ,శ్రీను,రాంబాబు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]