in ,

ఓటర్లు నమోదు ను 15 లోగా ఆన్లైన్ చేయండి

పాడేరు, అల్లూరి జిల్లా: అరకు నియోజకవర్గ పరిధిలోని కొత్తగా నమోదు చేసుకున్న 4272 మంది ఓటర్లను  ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ ఆదేశించారు.
మంగళవారం ఐటీడీఏ కార్యాలయం నుండి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల ఏఈఆర్ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన ఓటర్లు 6838 మంది ఉన్నారని సంబంధిత ఫారాలను ప్రాజెక్ట్ అధికారి లాగిన్ కు పంపించాలని సూచించారు.  6,7,8 ఫారాలను ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పారు.ఆరు మండలాల పరిధిలో 6891 మంది వాటర్లకు మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని చెప్పారు. మార్పులు చేర్పుల్లో 59 శాతం పూర్తి చేశారని, మిగిలిన 41 శాతం వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన ఆదేశాలను ఏ ఈ ఆర్ వో లకు వివరించారు. 6838 మంది మృతి చెందిన ఓటర్లను తొలగించ వలసి వుందని తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబు చన్నీటి స్నానం చేస్తున్నారు- నారా భువనేశ్వరి

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా తన వంతు కృషి చేస్తానని”