in ,

కదం తొక్కిన సత్తుపల్లి బాలికల ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా గల సత్తుపల్లి బాలిక ప్రభుత్వ కళాశాల నందు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సత్తుపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి సత్తుపల్లి బోసు బొమ్మ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి బెజవాడ సాయి శేషు మాట్లాడుతూ కళాశాలలో ఖాళీగా ఉన్న బోటనీ,పొలిటికల్ సైన్స్ అధ్యాపకులను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని, కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ లైబ్రేరియన్,శానిటేషన్ సిబ్బంది కూడా లేదని ఎన్నిసార్లు జిల్లా అధికారులకు అర్జీలు పెట్టిన కనీసం స్పందించడం కూడా లేదని అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని లేకుంటే విద్యార్థుల అందరితో కలిసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ముందు ముందు రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే సత్తుపల్లి గర్ల్స్ కన్వీనర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కళాశాల సమస్యలను త్వరగా పరిష్కారం చేయకుంటే నిరాహార దీక్షకు సైతం దిగుతామని అన్నారు.అనంతరం సత్తుపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద కల్లూరు డివిజన్ ఆర్డిఓ అశోక్ చక్రవర్తి గారికి వినతి పత్రం అందజేసి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సత్తుపల్లి మండల కార్యదర్శి మహమ్మద్ కైఫ్, పెనుబల్లి మండల కార్యదర్శి వెంకటేష్ స్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ కో- కన్వీనర్ ఆశా బేగం, విజయలక్ష్మి,సత్య మాధురి దుర్గ ఉష,శృతి,హారిక తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

చేతకాని ప్రభుత్వంతో రైతులు అవస్థలు…

ఎన్నికల సమయంలో చెక్ పోస్ట్ లు కీలక పాత్రను పోషిస్తాయి.