in , , ,

అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి

పామాయిల్ తోటలో అనుమానస్పదంగా ఆటోడ్రైవర్ మృతి 

==ఆంధ్రాలోని చింతలపూడి మండలం లింగగూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తింపు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పెద్దపాకలగూడెం గ్రామ పంచాయితీలోని సత్యనారాయణ గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో ఓ వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం సత్తుపల్లి పోలీసులు గుర్తించారు. సత్తుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చిమట కేశవరావు (30) ఆటో డ్రైవర్ కాగా ఈనెల 1వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో సత్యనారాయణపురంలోని నీలపాల చందర్రావుకు చెందిన పామాయిల్ తోటలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కల్లూరు ఏసీపీ బీ. రామానుజం, సత్తుపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్, ఎస్ఐలు శ్రవణ్, కుశకుమార్లు సిబ్బందితో పామాయిల్ తోటకు వెళ్లారు. ఖమ్మం నుంచి క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరించిన అనంతరం పోస కుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుని తల్లీదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా అక్కడ పరిస్థితిని బట్టి హత్య చేసినట్లుగా స్థానికులు ప్రాధమికంగా భావిసు న్నారు.

[zombify_post]

Report

What do you think?

పరమేశ్వరి ఉత్సవాలు జరుపుకునేందుకు మండపం*

అవయవదానంతో ఏడుగురి ప్రాణాలు కాపాడిన యువతి..