అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సలుగు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఈశ్వరమ్మను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈశ్వరమ్మ పనితీరు పై పలువురు స్పందనలో జిల్లా కలెక్టర్ సుమిత్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు ఆదేశించిన ఆయన ఈశ్వరమ్మ విధుల్లో అలసత్వంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సచివాలయం సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ తెలిపారు.
[zombify_post]