ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారని ఏటిఎఫ్ మహబుబాబాద్ జిల్లా అద్యక్షులు సిద్దబోయిన బిక్షం అరోపించారు .మంగళవారం నాడు కొత్తగూడ మండల కేంద్రం లో యూటిఎఫ్ ,ఆట ,ఏటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల అద్వర్యం లో నిర్వహించిన పత్రిక ప్రముఖుల సమావేశం లో సిద్దబోయిన బిక్షం మాట్లడుతూ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ జిల్లా విద్యాశాఖ ఇవేవీ పట్టించుకోకుండా పనితీరును కాకుండా పైరవీకారులకు, అనర్హులకు జాబితాలో చోటు కల్పించిదాని ,
పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకు పెద్దపీఠ వేసినట్లు,పది అంశాల ప్రామాణికంగా ఉత్తములుగా గుర్తించాలని . విద్యార్థుల నమోదులో అసాధారణ చొరవ, డ్రాప్ అవుట్‌లను నివారించడం, అనుభవం, పదోతరగతిలో వందశాతం విద్యార్థుల ఉత్తీర్ణత, ఆయా పోటీల్లో విద్యార్థులకు దక్కిన అవార్డుల్లో వారి పాత్ర, ఆవిష్కరణల అమలు,వందశాతం ఆధార్ సీడింగ్, బడుల్లో మౌలిక వసతుల కల్పనకు జరిపిన కృషి, హరితహారంలో ప్రగతి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన ఇవి ఏమి పట్టించుకోకుండ పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు .ఈ కార్యక్రమం లో గుంట సూర్యనారాయణ ,రేగ పాపారావు ,చుంచ రమేశ్ ,మద్దెల హరినాధం ,తదితరులు పాల్గోన్నారు …
[zombify_post]