లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు త్వరితగతిన అందించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి లోని కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో బీసీ మైనార్టీ సంక్షేమ పథకాలు ఆయిల్ ఫామ్ విస్తరణ స్వచ్ఛ సర్వేక్షన్ ఎస్ బి ఎం బృందాల పర్యవేక్షణ ఆసరా పెన్షన్లు అటవీ హక్కు పత్రాల పంపిణీ వంటి కార్యక్రమాల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
మైనారిటీ అధికారులు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టి పూర్తి చేయాలన్నారు.
అదేవిధంగా బీసీ సంక్షేమ అధికారులు లబ్ధిదారులను గుర్తించాలని యూనిట్స్ మంజూరు చేస్తూ వాటితో వారి ఆర్థిక ప్రగతి పెంచుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ వ్యవసాయంలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా రైతులకు స్థిరాదాయాన్ని కల్పించే పామాయిల్ పంటపై రైతులకు అవగాహన కల్పిస్తూ విస్తరింప చేయాలన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఇటీవల ఎస్ బి ఎం బృందాలు సూచించిన విధంగా 10 గ్రామాలైన బయ్యారం, కొత్తపేట, గార్ల ,తండా ధర్మారం, రామన్నగూడెం ,మల్యాల, ఏపూరు, కొత్తూరు జి , ఫత్తేపూర్, చాపల తండా లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు మరుగుదొడ్లు ఏర్పాటు పాఠశాలల్లో బాలికలకు బాలురకు ప్రత్యేకమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాలన్నారు.
చాప్లతండకు గుర్తింపు వచ్చిందని గోబర్ గ్యాస్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పెన్షన్ మంజూరిలో మృతుల వివరాలు సేకరించాలని అర్హులైన వారి నివేదిక తీసుకోవాలన్నారు గ్రామాలలో సోక్పిట్టుల ప్రాధాన్యత తప్పనిసరిగా ఉంటుందని సంబంధిత అధికారులతో సమీక్షించుకొని చేపట్టాలన్నారు మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నచోట తప్పనిసరిగా సోక్ పిట్ ఉండాలన్నారు.
అటవీ హక్కు పత్రాల పంపిణీ చేయని తగు కారణాలను వివరిస్తూ నివేదిక అందజేయాలన్నారు. ఎఫ్ ఆర్ సి నిబంధనల ప్రకారం కమిటీ సమావేశమై తీర్మానం చేసి నివేదిక అందజేయాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్ జెడ్పిసిఓ రమాదేవి డిఆర్డిఏ పిడి సన్యాసయ్య జిల్లా అధికారులు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]