ఆగస్టు 23 నుండి 27వ తేదీ వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన వాకో ఇండియా నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జగిత్యాల బిజెపి నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ శైలేందర్ రెడ్డి అభినందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శైలేందర్ రెడ్డి పతకాలు సాధించిన ఎం సాయి సృజన్, ఏ హర్షిత్, జి వశిష్ట లను సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలలో జగిత్యాల విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం మనకెంతో గర్వకారణం అని అలాగే అంతర్జాతీయ స్థాయిలో వెళ్లేవారికి తన వంతు ప్రోత్సాహం అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ రామాంజనేయులు, జగిత్యాల బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిరిపురం మహేంద్రనాధ్, లయన్స్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీరాముల సుదర్శన్, ఫిజియోథెరపిస్టు జహీర్, తోట హనుమంతు పటేల్, యు.గంగాధర్, కట్ల శ్రీనివాస్, రవి, వెంకటేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]