అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం….. హైవేపై ఆగివున్న లారీని విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఓ ప్రయాణికుడు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
[zombify_post]