దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. రుణమాఫీ చేసిన రైతులందరికీ కొత్తగా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. రైతులను తమ ప్రభుత్వం మాత్రమే ఆదుకుందని.. ఇంకా రుణమాఫీ కాని వారికి కూడా మాఫీ జరుగుతుందని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రైతులకు రూ. లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ చేసిన రైతులందరికీ వెంటనే కొత్త రుణాలివ్వాలని బ్యాంకర్లను మంత్రి ఆదేశించారు. రుణమాఫీ కాని మిగతావారికి ప్రాధాన్య క్రమంలో మాఫీ జరుగుతుందని అన్నారు. బ్యాంకు అకౌంట్లు పనిచేయకపోవడం తదితర కారణాల వల్ల మాఫీ డబ్బులు జమ కాని వారికి వెంటనే అందజేస్తామని చెప్పారు.
[zombify_post]