- గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దచెరువు మత్తడి పొంగి ప్రవహిస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ బోయిని రాంచందర్, ఎస్సై రమాకాంత్ లు సోమవారం వేరువేరుగా వెళ్లి పరిశీలించారు. గిద్ద చెరువు వరద నీటి ప్రవాహానికి నిండుకుండల మారి హెచ్చరిక సూచికలను దాటి మత్తడి పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఏవరు కూడా చేపలు పట్టడానికి మత్స్యకారులు వెళ్ళవద్దని తాహాసిల్దార్ రాంచందర్ హెచ్చరికలు జారీ చేశారు. భారీగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతేనే ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలని మట్టి గోడలు గూన పెంకుల గల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండరాదని పిలుపునిచ్చారు. ఆయన వెంట వెంట డిటీ జయంత్ కుమార్, ఆర్ఐ సంతోష్, ఎస్ ఐ రమాకాంత్ వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.
[zombify_post]