- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మానాలలోని కోమటికుంట చెరువు కట్టకు గండిపడడంతో పెద్ద ఎత్తున నీరువృథాగా పోతోంది. సోమవారం రోజున ఎంపీడీవో శంకర్,వైస్ఎంపీపీ పిసరి భూమయ్యతో కలిసి చెరువుకట్టను పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు.గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరినైనా ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. వీరి వెంట పీఆర్ ఏఈ మనోహర్,పంచాయతీ కార్యదర్శి బాబు తదితరులు ఉన్నారు.
[zombify_post]