in , ,

అల్లూరి జిల్లా లో తప్పని డోలు మోతలు

పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: అనారోగ్యం తో బాధపడుతున్న బాలింతను సుమారు రెండు కిలోమీటర్లు దూరం డోలీమోతతో తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించిన ఘటన జీకేవీధి మండలంలో చోటుచేసుకుంది.వంచుల పంచాయతీ అడగరాపల్లికి చెందిన పొత్తూరు సరస్వతి గత నెలలో పాపకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంతో మరణించింది. ఈ దుఃఖం నుంచి తేరుకోకముందే సరస్వతికి అనారోగ్యానికి గురైంది. గ్రామం నుంచి రహదారి లేకపోవడంతో గ్రామస్థులు డోలీ కట్టి ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లవరం వరకూ తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెû్్సలో ఆసుపత్రికి తరలించారు. అడగరాపల్లి నుంచి ఎల్లవరం వరకు రోడ్డు బాగోలేదని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, గ్రామానికి కనీసం ద్విచక్రవాహనం కూడా రాలేని పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి రహదారి నిర్మించాలని వారంతా కోరుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యువత

రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా