కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు సోమవారం కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామంలో గడప గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, తూము చౌదరి,ఆళ్ల మురళిలు పాల్గోని మాట్లాడుతూ తెలంగాణ వనరులను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది అన్నారు. టీఆర్ఎస్ పాలనలో గల్లీకో బెల్ట్ షాపు తప్ప జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ప్రస్తుతం హడావుడిగా మొదలు పెట్టిన అభివృద్ధి పనులన్నీ కమిషన్ ల కోసం తీసుకున్నవని అన్నారు. సామాన్య కార్యకర్తను ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీ దేనని,గౌరవం దక్కాలి అన్న, ప్రజా సేవ చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఒక సరైన వేదిక అన్నారు. బిఆర్ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబానికి, కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా కుటుంబ సభ్యులకు వారి అనుచరులకు తప్ప పేదవాడికి లాభం ఏమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, ఖలీల్, హేమంత్ యాదవ్, బావ్ సింగ్, అజ్మీర లైలా, చింత రమేష్, కొంపల్లి వీరయ్య, సరిత, పుష్ప, నరసింహారావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, కనకరాజు, సంపత్, రాజు, కాకా లక్ష్మయ్య, మల్లేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
[zombify_post]