బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమితులై కొత్తగూడెంకు మొట్టమొదటి సారి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు గులాబీ శ్రేణులు,ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.వందల వాహనాలు,వేలమంది తన వెంట రాగా ఎంపీ రవిచంద్ర ఖమ్మం నుంచి సోమవారం ఉదయం 10గంటలకు కొత్తగూడెం నియోజకవర్గానికి బయలుదేరగా,దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. తనికెళ్ల, కొణిజర్ల, వైరా, తల్లాడ, ఏన్కూరు,జూలూరుపాడు, నాయకులగూడెం, కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్, న్యూపాల్వంచ అంబేడ్కర్ సెంటర్, జగన్నాథపురంలలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. తల్లాడ వద్ద బీఆర్ఎస్ నాయకుడు వెంకటలాల్ ఆధ్వర్యంలో నాయకులు ఎంపీ రవిచంద్రకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. జూలూరుపాడు చేరుకున్న వద్దిరాజుకు కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీపీ లావుడ్య సోని,మున్నూరుకాపు సంఘం ప్రముఖులు బాపట్ల మురళి, రామిశెట్టి రాంబాబుల నాయకత్వంలో పూలుజల్లుతూ, పటాకులు కాల్చుతూ,డప్పు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు.ఆ పక్కనే ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ రవిచంద్ర పూలమాల వేశారు. ఎంపీ వద్దిరాజుకు నాయకులగూడెం వద్ద ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల కోలాహలం, నినాదాలు,పటాకుల మోత,డప్పు వాయిద్యాలు, లంబాడ,కోయ నృత్యాల మధ్య ర్యాలీ కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ చేరుకోగా స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. ఓల్డ్,న్యూ పాల్వంచల మీదుగా ర్యాలీ జగన్నాథపురం పెద్దమ్మ తల్లి సన్నిధికి చేరింది.న్యూపాల్వంచ అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారిద్దరిని బీఆర్ఎస్ నాయకులు గజమాలతో సన్మానించారు.పెద్దమ్మ తల్లి ఆలయ పాలకమండలి, అధికారులు, పూజారులు డప్పు వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే వనమాలకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అటు తర్వాత జరిగిన సభలో వారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.రవిచంద్ర పర్యటన సందర్భంగా గులాబీమయమైన కొత్తగూడెం..
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమితులయ్యాక మొట్టమొదటి సారి పర్యటనకు రాగా కొత్తగూడెం, ఓల్డ్,న్యూ పాల్వంచ, జగన్నాథపురంలు గులాబీమయమయ్యాయి.ఎంపీ రవిచంద్రకు స్వాగతం చెబుతూ స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు,కటౌట్లు ఏర్పాటు చేశారు, గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది
[zombify_post]