in ,

జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి – మాజీ ఎమ్మెల్సీ

రాజమహేంద్రవరం , తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్రాన్ని, ప్రజలను దోపిడీ చేస్తూ, ఎదురించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్‌ మోహన్‌రెడ్డి నియంత పాలనపై తిరుగుబాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు.  చంద్రబాబు నాయుడికి మద్దతుగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 26వ రోజులు చేరుకున్నాయి. అగురు ధన్‌ రాజ్‌, కేబుల్‌ మురళి, సందక లక్ష్మణరావు, సంపత్‌, లంక రామారావు, మండల రవి తదితరుల నేతృత్వంలో 46, 47 డివిజన్లకు చెందిన తూర్పు కాపు సంఫీుయులు అధిక సంఖ్యలో దీక్షా శిబిరంలో కూర్చుని నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, రాజమండ్రి పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులు మాట్లాడుతూ ఏపీకి వెలుగును నింపే వ్యక్తి ఈరోజు అన్యాయంగా అక్రమంగా నిర్బంధించబడి ఉన్నారన్నారు. భవిష్యత్‌లో ఆయన లేకపోతే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఎన్ని కుళ్లు కుతంత్ర రా జకీయాలు చేసినా… అవి సాగవని, కొంచెం ఆలస్యమైనా చంద్రబాబు నాయుడు నిష్కళంకంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో రా ష్ట్రంలో టీడీపీ మైలేజ్‌ బాగా పెరిగిందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే కాలం దగ్గరకొచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్‌ చేసి నేటికి 30 రోజులైందని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారని విమర్శించారు. ‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని, 29రోజులుగా సీఐడీ ఏం చేసిందని, 3300కోట్ల అవినీతి ఆరోపణల నుంచి 370 కోట్లు అని ఇప్పుడు 27కోట్లు అంటున్నారని, తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ము అంటున్నారని, విరాళాలు బహిర్గతం చేసేందుకు తమ అధినాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అక్రమంగా అరెస్ట్‌చేయడం జగన నియంతృత్వ పాలనకు నిదర్శనంగా ఉందన్నారు. ఈ నియంతపాలనకు రాబోయే ఎన్నికల్లో చరమగీతం పాడుదామని పిలుపు నిచ్చారు. శనివారం రాత్రి టీడీపీ కుటుంబ సభ్యులు చేసిన కాంతితో క్రాంతి నిరసన వేడి జగన్మోహన్‌రెడ్డికి తాకేలా ప్రజలు స్పందించారని తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్‌ కమిటీల సభ్యులు, నగర కమిటీల సభ్యులు, మహిళ కమిటీలు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

బండారు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు కు వెళ్తా… మంత్రి రోజా

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధి కోసం ముద్దు అకాడమీ.