రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ తూర్పు గోదావరి జిల్లా సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులు మరియు వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లు మరమ్మత్తులకు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమేరకు ది.27.09.2023 బుధవారం (ప్రారంభ గంటలు) నుండి 26.10.2023 వరకు ఆర్ కం రైల్ వంతెన పై ట్రాఫిక్‌ను మళ్లించడానికి జిల్లా ఆర్ అండ్ బి అధికారి అభ్యర్థన చెయ్యడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ సి ఆర్ బి పై పూర్తిగా మేరకు ట్రాఫిక్ మళ్లింపు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న రోడ్-కమ్-రైల్ బ్రిడ్జి (అప్రోచ్‌లతో సహా) యొక్క క్యారేజ్‌వే బాగా దెబ్బతినడం వల్ల, మరమ్మత్తు పనులకు సులువుగా ఉండేలా తక్షణ పునరుద్ధరణ అవసరం మేరకు వాహనాల రాకపోకల కదలిక ను పూర్తిగా నెల రోజుల పాటు నియంత్రించ నున్నట్లు పేర్కొన్నారు. “రోడ్-కమ్-రైల్ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టడానికి గాను వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా బి . టి. క్యారేజ్‌వే పునరుద్ధరణ 0.00 కి. మీ.ల నుంచి 4.473 కి.మీ.ల పొడవు దెబ్బతిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్ గ్రిడ్‌లకు చెందిన ప్రత్యేక మరమ్మత్తు, మెరుగుదలలు రూ.210 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మిల్లింగ్ మిషన్ తో బిటి సర్ఫేస్‌ను తొలగించడం తదితర పనులు చేపట్టడం జరిగిందన్నారు.
చేపడుతున్న పనుల దృష్ట్యా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ను నియంత్రిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించడం జరుగుతుందన్నారు. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి పోలీసు సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం వారు రాజమహేంద్రవరం, కొవ్వూరు ల నుంచి ట్రాఫిక్ మళ్లింపులో తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అదేవిధంగా జిల్లా రవాణా అధికారి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం మరియు రీజనల్ మేనేజర్, ఎపీఏస్ ఆర్టీసి తూర్పు గోదావరి, రాజమహేంద్రవరం వారు వాహనాలు దారి మళ్లించడంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు చెందిన కాలానికి అనుగుణంగా తగిన అవసరమైన చర్య తీసుకోవాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం జిల్లాలోని సంబంధిత విద్యాసంస్థలకు ఆర్ సి ఆర్ బి మూసివేత గురించి ముందస్తుగా సమాచారం తెలియజేయాలని ఆదేశించారు. తదనుగుణంగా వారు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారని పేర్కొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!