పార్వతీపురం పట్టణం, గ్రామీణం, : గడ్డిమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మండలంలో జరిగింది. శివన్నదొరవలసకు చెందిన జె.ప్రసాద్(25) వ్యవసాయ కూలీ. తల్లిదండ్రులు లేరు. అయిదుగురు అక్కలున్నారు. మంగళవారం వరహాలుగెడ్డ డ్యాం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. వరుసకు బావలైన పి.త్రినాథ, శంకరావు చూసి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ
కన్నుమూశాడు. మృతికి కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేశామని గ్రామీణ పోలీసులు తెలిపారు
[zombify_post]