అర్ధరాత్రి వేళ గెడ్డ ప్రవాహంలో చిక్కుకుపోయారు. అనుకోని ఘటన ఎదురైనా అప్రమత్తతతో వ్యవహరించి, సురక్షితంగా బయపడ్డారు జియ్యమ్మవలసకు చెందిన దాసరి స్వామినాయుడు.
అర్ధరాత్రి వేళ గెడ్డ" ప్రవాహంలో చిక్కుకుపోయారు. అనుకోని ఘటన ఎదురైనా అప్రమత్తతతో వ్యవహరించి, సురక్షితంగా బయపడ్డారు జియ్యమ్మవలసకు చెందిన దాసరి స్వామినాయుడు. వివరాల్లోకి వెళితే.. వ్యక్తిగత పనిమీద ఆదివారం ఆయన కారులో విశాఖ వెళ్లారు. అర్ధరాత్రి వేళ తిరుగు ప్రయాణమయ్యారు. వీరఘట్టం మీదుగా వస్తుండగా గడసింగుపురం సమీపంలోకి రాగానే భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న రాళ్లగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో అందులో చిక్కుకుపోయారు. అక్కడెవరూ లేకపోవడంతో హాహాకారాలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో కారు రోడ్డుపై నుంచి గెడ్డలోకి ఒరిగిపోయింది. అప్రమత్తమైన ఆయన అద్దాలు బద్దలు కొట్టి వాహనం పైకెక్కి.. చరవాణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకుని బాధితుడ్ని రక్షించారు. అనంతరం కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
[zombify_post]